ఉస్మానియా యూనివర్సిటీ, మే 28: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)-2022 కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ఓయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది సీపీజీఈటీ-2021కు సైతం పాండురంగారెడ్డే కన్వీనర్‌గా వ్యవహరించారు.
ఓయూ జియాలజీ విభాగానికి చెందిన ఆయన ప్రస్తుతం ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో పాలమూరు యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా, ఓయూ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్, సైఫాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, వైస్ ప్రిన్సిపాల్, వార్డెన్, హెడ్‌గా పనిచేశారు.