హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ ఎవరన్న అంశంపై స్పష్టతవచ్చింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డియే వచ్చే విద్యాసంవత్సరంలో ‘దోస్త్’ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడోవారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. దీంతో ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలకు ఉన్నత విద్యామండలి అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సులకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.