చండూరు అక్టోబర్ 25: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గౌడ కులస్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చండూరులో ఆయన మాట్లాడుతూ.. గౌడ బంధువులు అందరూ కేసీఆర్కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
గీత కార్మికుడు తాడిచెట్టు పైనుంచి పడి చనిపోతే ఎక్స్గ్రేషియా చెల్లించడమే కాకుం డా ప్రమాదం జరిగిన చోటుకు అంబులెన్స్ పంపే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల్లో ఏర్పాటు చేస్తున్న లే అవుట్లలో ఉన్న తాటి చెట్లను తొలగించడంతో గీత కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, అక్కడ ఆ లేఔట్లలో కొంత స్థలం తాటి, ఈత వనం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిపా రు. సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు.