నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని గురువారం సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పరిశీలించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆమె పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కలెక్టరేట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ నారాయణ రెడ్డి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.