హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌరసంబంధాలశాఖ కీలకమని పౌరసంబంధాలు, సమాచారశాఖ ప్ర త్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక అన్నా రు. సమాచారశాఖ ప్రధాన కార్యాలయంలో పౌరసంబంధాల అధికారిగా విధులు నిర్వర్తించిన ముళ్లపూడి శ్రీనివాస్‌కుమార్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు సమాచారశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
పీఆర్వోగా ముళ్లపూడి శ్రీనివాస్‌కుమార్ తన విధులను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రశంసించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితా న్ని చాలా కోల్పోతామని.. ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌కుమార్ కుటుంబసభ్యులను సమాచారశాఖ అధికారులు, సిబ్బంది సన్మానించారు. అనంతరం శ్రీనివాస్‌కుమార్ మా ట్లాడుతూ.. తన 38 ఏండ్ల ఉద్యోగ జీవితం సంతృప్తిగా సాగిందని తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేయడంతో సమాచారశాఖకు తాను చేసి న సేవలకంటే.. పొందినదే ఎకువ అని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు సంచాలకుడు డీఎస్ జగన్, సంయుక్త సంచాలకులు కే వెంకటరమణ, వెంకటేశ్వరావు, ఉప సంచాలకులు మధుసూదన్, వై వెంకటేశ్వర్లు, ప్రసాద్, హష్మీ, సమాచారశాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.