హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ చదువులు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. ప్రత్యేకించి 1-5తరగతుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. జాతీయంగా మణిపూర్, తెలంగాణ, పుదుచ్చేరిలు మొదటి వరుసలో ఉన్నాయి. ఇదే విషయం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఎస్వో)లో వెల్లడైంది. తల్లిదండ్రుల ఆదాయ వ్యయాలు, ఆకాంక్షలు పెరుగుతుండటంతోనే ప్రైవేటు చదువులు అధికమవుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో బోధిస్తుండగా, ప్రైవేట్లో ఇంగ్లిష్మీడియంలో బోధిస్తున్నారు. చిన్న బడ్జెట్ స్కూైళ్లెనా పర్వాలేదన్నట్టుగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్లో చేర్పిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జాతీయంగా పరిస్థితి భిన్నంగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రైమరీ చదువులకు అత్యధికులు సర్కారు స్కూళ్ల వైపు మెగ్గు చూపుతున్నారు.