హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తేతెలంగాణ) : బీసీ బిడ్డ ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన చేపట్టాలని పలువురు రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. జనాభా ప్రతిపాదికన చట్టసభలతోపాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసి దశాబ్దాల కాలంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్న వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. బీసీ హకుల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అధ్యక్షతన శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో ‘దేశ జనగణనలో కులగణన, బీసీలకు చట్టసభల్లో 5 శాతం రిజర్వేషన్లు, జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. డిమాండ్ల సాధనకు జేఏసీగా ఏర్పడి ఉద్యమా లు నిర్మించేందుకు ముందుకు రావాల ని సమావేశం తీర్మానించింది.
ఈ సం దర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీసీల వెనుకబాటుతనం అం తం కావాలంటే వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రభుత్వాలు చేయూత అందించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కా ర్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. బీసీ సమస్యల సాధనకు సీపీ ఐ పలు సందర్భాల్లో ప్రత్యక్ష ఉద్యమా ల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలంగాణ వృత్తి సంఘాల సమాఖ్య రా ష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ ఆ వేదన వ్యక్తంచేశారు. దేశంలో రిజర్వేషన్లు కేవలం 50 శాతం మాత్రమే ఉం డాలని సుప్రీంకోర్టు పరిధి విధించిందని, బీసీలంతా ఏకమైతే ఈ గీత ఇట్టే చెరిగిపోతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికా రి టీ చిరంజీవులు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ కులం ఏమిటి..? అని బీజేపీ నేతలు పదే పదే ప్రశ్నించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ప్రొఫెసర్లు మురళీమనోహర్, ప్రభంజన్‌యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ఉన్నారు.