హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సాంకేతిక అర్హత సాధించిన 4ఏజేన్సీల్లో 3 సంస్థల నుంచే ప్రైస్‌బిడ్లను ఆహ్వానించాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నది. ఆ సంస్థల నుంచే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) స్వీకరించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సిఫారసులకు అనుగుణంగా బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు డిజైన్లను ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ను ఇరిగేషన్‌శాఖ ఆహ్వానించిన విషయం విధితమే. మొత్తంగా 5 సంస్థలు ఆసక్తి చూపాయి. అందులో 4 ఏజెన్సీలకు మాత్రమే సాంకేతిక అర్హతలు ఉన్నాయని ఇరిగేషన్‌శాఖ నిర్ణయించింది. 3 ఏజెన్సీల నుంచి ప్రైస్‌బిడ్లను, ఆర్ఎఫ్పీని ఆహ్వానించేందుకు కసరత్తు చేస్తున్నది.