స్వాతి లక్రా, బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు
స్వాతి లక్రా | తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సెఫ్టీ వింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి పోలీసు పతకాలు దక్కాయి.

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైనిక, పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ వివిధ పతకాలను ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలను ప్రకటిస్తూ.. ఆ జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ( PPMG ) ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సెఫ్టీ వింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి.
గ్యాలంటరీ పోలీసు పతకాలు వరించిన తెలంగాణ పోలీసులు వీరే..
- పీకే ఎస్ రమేశ్ ( AAC )
- ఎన్ లాల్యా ( SC )
- ఎం పాపారావు ( JC )
- ఎం భాస్కర రావు ( JC )
- జీ ప్రతాప్ సింగ్ ( JC )
- కే వెంకన్న ( JC )
- మాలోతు రాములు ( JC )
- బీ మరియా దాస్ ( Dy.AC )
- కే పరుశురామ్ నాయక్ ( SC )
- అబ్దుల్ అజీం ( JC )
- కే తిరుపతయ్య ( SC )
- పీ సత్యనారాయణ ( JC )
- వీ రమేశ్ ( JC )
- గుర్రం కృష్ణప్రసాద్ ( SI )
ఉత్తమ సేవా పోలీసు పతకాలు దక్కింది వీరికే..
- వీ శివకుమార్ ( డీఐజీ ఇంటెలిజెన్స్, లక్డీకాపూల్ )
- మేఘావత్ వెంకటేశ్వర్లు ( అడిషనల్ ఎస్పీ, మాదాపూర్ జోన్ )
- రమేశ్ దండుగుడు ( అడిషనల్ ఎస్పీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, బేగంపేట )
- జితేందర్ రెడ్డి ( ఏఎస్సీ, హన్మకొండ )
- చంద్రశేఖర్ ఆకుల ( ఏఎస్సీ, ట్రాఫిక్ మాదాపూర్ డివిజన్ )
- పిట్చయ్య మువ్వ ( డీఎస్పీ, పోలీసు ట్రైనింగ్ సెంటర్ కాలేజీ, అంబర్ పేట )
- సంపత్ కుమార్ రెడ్డి ( అసిస్టెంట్ కమాండంట్, 1ST బెటాలియన్ టీఎస్ఎస్పీ యూసుఫ్‌గూడ )
- ఆనంద్ కుమార్ ( ఏఎస్ఐ, హైదరాబాద్ )
- చంద్రశేఖర్ రావు ( ఏఎస్ఐ (IT&C), టీఎస్ పోలీసు అకాడమీ )
- ఆరిఫ్ అలీ మహ్మద్ ( సీనియర్ కమాండో, పుప్పాలగూడ పోస్ట్ )
- అనిల్ గౌడ్ ( హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పీఎస్ కాచిగూడ )
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

