సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్రమంత్రి ఉషా శ్రీచరణ్, ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్రమంత్రి ఉషా శ్రీచరణ్, ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.
ఆ తర్వాత పుట్టపర్తిలో సాయిహీరా ఇంటర్నేషనల్ సెంటర్కు రాష్ట్రపతి చేరుకున్నారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 14 మందికి డాక్టరేట్లు, 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. అనంతరం రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

