హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి మంగళవారం (నవంబర్ 14వ తేదీ) ఉదయం 9 గంటల వరకు రూ.198.30 కోట్ల నగదు సహా మొత్తం రూ.571.80 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 2.55 కోట్ల నగదు సహా రూ.12.88 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఎస్టీ, పోలీస్, ఎక్సైజ్, ఎస్ఎస్టీ అధికారులు ఏర్పాటుచేసిన 18 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల వద్ద మంగళవారం వరకు రూ.53.18 కోట్ల నగదు, బంగారం తదితర సామగ్రిని సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.