జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే నేడు జూరాల డ్యామ్ పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాస్ హనుమంత నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేవశను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజా పాలనలో పోలీస్ పహారాలు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై అంక్షలు ఎందుకని నిలదీశారు. జూరాల ప్రాజెక్టు నుంచి రైతుల పంటలకు సాగు నీరు అందించే వరకు బీఆర్ఎస్ తరఫున ఉద్యమి స్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను వారు ఖండించారు.