హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసింది. రెండో వేతన సవరణ రిపోర్టును ప్రభుత్వం త్వరగా తెప్పించుకుని అమలు చేయాలని కోరి ంది. టీఆర్టీఎఫ్ రాష్ట్రకార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డిలు మాట్లాడుతూ.. 2023జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ.. 2025 ఏప్రిల్ పూర్తవుతున్నా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. దేశంలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. వేసవిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా ప్రభు త్వం క్యాలెండర్‌ను రూపొందించాలని కో రారు. జూన్ 9న జరిగే ఉద్యోగుల జేఏసీ మహాధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నేతలు లక్కిరెడ్డి సంజీవరెడ్డి, కావలి అశోక్‌కుమార్, కటకం రవికుమార్, జీ రాంరెడ్డి, మహేందర్‌రాజ్, కిరణ్‌జ్యోతి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.