హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ప్రతిమా ఇన్ఫ్రా గ్రూపునకు ఎండీవో (మైన్ డెవలపర్-ఆపరేటర్) కేటాయింపుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను సంస్థ వైస్ ప్రెసిడెంట్ పీ అనిల్‌కుమార్ ఖండించారు. సింగరేణి కాలరీస్ సంస్థతో తమకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరో డిప్యూటీ సీఎంను తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అటువంటి వ్యక్తుల మాటలు నమ్మవద్దని హితవు పలికారు.