హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీ గురుకుల, బీసీ హాస్టల్లో ఉంటూ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన బీసీ విద్యార్థులకు ( BC Students ) ఈనెల 14న ప్రతిభా పురస్కారాలు (Prathibha Puraskarams) అందిస్తుందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhaker ) తెలిపారు.
పదో తరగతి, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బంజారా హిల్స్‌లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్లో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు అందిస్తున్నామని వివరించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభావంతులైన 508 మంది విద్యార్థులను సన్మానిస్తామన్నారు.
పదో తరగతి ఫలితాలలో మహాత్మా జ్యోతిభా ఫూలే నుంచి 147 మంది విద్యార్థులు (576 కటాఫ్), బీసీ హాస్టల్ విద్యార్థులు 67 మంది (550 కటాఫ్) కి మొత్తం 214 మంది విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 137 మంది విద్యార్థులు (988 కటాఫ్/1000), 28 మంది బీసీ హాస్టల్ విద్యార్థులు మొత్తం 165 మంది విద్యార్థులను సత్కరిస్తామని అన్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (467/437/493 కటాఫ్) సాధించిన 107 మంది
ఎంజేపీ విద్యార్థులు, 22 మంది బీసీ హాస్టల్ విద్యార్థులు మొత్తం 129 మంది విద్యార్థులను సన్మానిస్తామని ఆయన తెలిపారు.