హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సలహాదారుడిగా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సలహాదారుగా ప్రసన్నకుమార్ పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించగా, అసెంబ్లీ స్పీకర్ జీ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు.
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ లోక్‌సభ స్పీకర్‌కు ఓఎస్డీగా, ఢిల్లీ శాసనసభకు కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశారు. సుప్రీంకోర్టులో రిజిస్ట్రార్‌గా కూడా కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు.