Tirumala | తిరుమలలో ప్రాంక్ వీడియోలు.. భక్తులపై అకతాయిల వెర్రిచేష్టలు
తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అకతాయిలు ప్రాంక్ వీడియో లు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..
- విచారణకు ఆదేశించిన టీటీడీ
Tirumala | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అకతాయిలు ప్రాంక్ వీడియో లు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు తిరుమల లోపల ప్రాంక్ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్ ఇచ్చారు. భక్తులు ఆ వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేచారు. వెంటనే సదరు యూట్యూబర్ కంపార్ట్మెంట్ నుంచి నవ్వుతూ పరుగులు తీశాడు.
ఇదంతా మరో యువకుడు వీడి యో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించిం ది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించిం ది. తిరుమల ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

