Prakash Raj : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇవ్వబోతోందని ఇటీవల ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. అయితే దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండానే ఆయనకు వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక సెటైరికల్ పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘మీరొస్తానంటె మేమొద్దంటామా..? రండి దొర.. కానీ వచ్చే ముందు.. ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదంటే సింగిల్‌గా వస్తున్నారా..? అది చెప్పి రండి’ అని ప్రకాశ్‌రాజ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు తన సిగ్నేచర్ హ్యాష్‌ట్యాగ్ #JustAsking ను జత చేశారు. ఈ పోస్టుతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ, రచ్చ మొదలయ్యాయి. పవన్ అభిమానులు ప్రకాశ్‌రాజ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు, గతంలో బెంగళూరులో పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన మీ చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవాలంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
పవన్ తెలంగాణలోకి ఎలా వస్తే మీకెందుకు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా జనసేన పార్టీ.. బీజేపీ, టీడీపీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఆ పార్టీలను తెలంగాణలో ఎవరూ దేకరని అంటున్నారు.
ఇది కూడా చదవండి>>>