హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ విషయంపై ఇంటర్‌బోర్డు కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో నిరంతరం ప్రాక్టికల్స్‌ను ప్రాక్టీస్ చేయించాలని ఆదేశించింది. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించే వరకు ఇలా చేయడం తప్పనిసరి అని ఆదేశాలిచ్చింది.