Parabhava Nama Samvatsara | హైదరాబాద్ : రాబోయే పరాభవ నామ సంవత్సరంలో(2026-2027) వచ్చే పండగల జాబితాను తెలంగాణా విద్వత్సభ నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు అందజేసింది. పండగల విషయాల్లో ఏ విధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకై గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణా విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్దాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండగల తేదీలను నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే పరాభవ నామ సంవత్సర పండగలను దాదాపు వంద మంది సిద్ధాంతులు జూలై 13న పుష్పగిరి జగద్గురు సంస్థానంలో నిర్వహించిన విద్వత్సభ సమావేశంలో ఖరారు చేశారు. ఈ పండగల జాబితాను తెలంగాణా విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి ఆధ్వర్యంలో కోశాధికారి ఎం. వెంకటరమణ శర్మ, సంయుక్త కార్యదర్శి కమలాకర శర్మ, సమన్వయకర్త భీంసేన్ మూర్తి, బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సెంటర్ చైర్మన్ విజయ్ ఒద్దిరాజులు.. సీఎస్ రామకృష్ణ రావుకు అందజేశారు.