హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): కమ్యూనిస్టులంతా ఏకమైతే అధికారం చేపట్టడం అసాధ్యమేమీ కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి వామపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా కవి గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ రచించిన ‘చలో ఖమ్మం’ సీడీని ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో బుధవారం ఆవిషరించారు. ఈ సందర్బంగా పల్లా మాట్లాడుతూ.. నాడు జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో సీపీఐ, ప్రజా సంఘాలు సముచిత స్థానాన్ని పోషించాయని పేరొన్నారు.