హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కొత్తగా నియమితులైన 10,006 మంది టీచర్లకు మంగళవారం ఆఫ్లైన్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. వారు గత గురువారమే డీఈవో కార్యాలయాల్లో రిపోర్ట్ చేయగా వారికి కేటాయించిన జిల్లాలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశా రు. బదిలీ అయిన ఉపాధ్యాయులను బుధవారంలోగా రిలీవ్ చేయాలని డీఈవోలకు సూచించారు. బుధవారం కొత్త టీచర్లకు కౌ న్సెలింగ్ అనంతరం వెంటనే విధుల్లో చేరే లా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.