Postmetric Hostels | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమహాస్టళ్ల తరహాలోనే మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనూ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బాల, బాలికలకు వేర్వేరుగా ప్రీ, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలు అందుబాటులో ఉండగా, మైనార్టీ సంక్షేమశాఖలో ఇప్పటివరకు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 204 గురుకులాలు ఏర్పాటు చేయగా, అవన్నీ ఏడాది కిందటే గురుకుల కాలేజీలుగా మారాయి. అయితే, ఇంటర్ అనంతరం డిగ్రీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు హాస్టళ్లు అందుబాటులో లేకపోవడంతో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు ఏర్పాటుచేసి ఒక్కో హాస్టల్లో 100 మందికి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్, నాంపల్లిలో భవనాలు నిర్మించారు. పనులన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది నుంచే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని మైనార్టీ సీవోఈలో నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ క్లాసులు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా మహీంద్ర గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీం ద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయ న ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. రేవంత్‌రెడ్డి ఇటీవలే ఆనంద్ మహీంద్రతో సమావేశమై సిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి చైర్మన్‌గా కొనసాగాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్నిఏర్పాటు చేస్తున్నారు.