నామినేటెడ్ పదవులను అమ్ముకున్నారు!
నామినేటెడ్ పదవులను అమ్ముకున్నారని, నాలుగు దశాబ్దలుగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్న తనకు అధిష్టానం అన్యాయం చేసిందని కరీంనగర్ సీనియర్ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణగౌడ్ మండిపడ్డారు.
- కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇవ్వలేదు
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణగౌడ్ ఆగ్రహం
- మార్కెట్ కమిటీ ఉపాధ్యక్ష, కాంగ్రెస్ పదవులకు రాజీనామా
కరీంనగర్ కార్పొరేషన్, మే 8: నామినేటెడ్ పదవులను అమ్ముకున్నారని, నాలుగు దశాబ్దలుగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్న తనకు అధిష్టానం అన్యాయం చేసిందని కరీంనగర్ సీనియర్ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణగౌడ్ మండిపడ్డారు. నలభై ఏండ్లుగా పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే పార్టీ ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్ష, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్కుమార్తోపాటు ఇతరులు కూడా మద్దతు పలికి ప్రభుత్వానికి సూచించారని తెలిపాడు. పార్టీకి సంబంధం లేకున్నా పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు ఉన్నాయంటూ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని పోటీ చేసినా వెలిచాల రాజేందర్రావును ప్రజలు ఓడించారని గుర్తుచేశారు.
పార్టీ కోసం పని చేస్తున్న తమకు కాకుండా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆకుల నర్సయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ఆకుల నర్సయ్య ఇటీవల కార్పొరేటర్ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం రూ.3 కోట్లు తీసుకున్నారని, ఇప్పుడు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోసం కూడా రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా రాజేందర్రావును నాయకుడిగా గుర్తించలేదని, డబ్బులతోనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారి వద్ద డబ్బులు తీసుకొని నామినేటెడ్ పదవులు ఇచ్చారని విమర్శించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి కలిసి సీఎం పైరవీ ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు మంత్రులు, జిల్లా నాయకత్వం ప్రతిపాదించినా తమకు పదవులు ఇవ్వలేదంటే డబ్బుతోనే పదవులొచ్చాయని భావిస్తున్నామని పేర్కొన్నా రు. ఇన్చార్జిగా చెప్పుకొంటున్న రాజేందర్రావును తొలగించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

