TG Cabinet | ఉత్కంఠ నడుమ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖల్లో ముఖ్యమైన హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను అట్టిపెట్టుకుని మిగిలిన శాఖలను కేటాయించారు. జి.వివేక్ వెంకటస్వామికి క్రీడ, కార్మిక, న్యాయ శాఖలను కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఇచ్చారు. ఇక వాకిటి శ్రీహరికి వాణిజ్యం, పశు సంవర్థక శాఖలను కేటాయించారు.