హైదరాబాద్ : తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులకు పీఎఫ్ఐ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని పోలీసులను హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేశారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు చట్టవిరుద్ధమైన సంస్థలు అని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పీఎఫ్ఐపై అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎఫ్ఐ రహస్య ఎజెండాను అమలుచేస్తూ ఒక వర్గాన్ని ప్రభావితం చేస్తోందని ఈ నోటీసులో పేర్కొంది.