హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను (పీవోపీఎస్కే) ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తున్నట్టు రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిద్దిపేట, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, భువనగిరి, మంచిర్యాల, కామారెడ్డి, వనపర్తి, మేడ్చల్, వికారాబాద్‌లోని పీవోపీఎస్కేల్లో సేవలు అందుబాటులోకి రానున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.passportindia. gove.in /mPassportseva యాప్ ద్వారా కూడా సేవలు పొందవచ్చని తెలిపారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు పాస్‌పోర్టు సేవల కోసం మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా ఆయా కార్యాలయాల్లో సేవలు పొందాలని సూచించారు.