హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా చేరిన వాంకుడోతు సరితను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో సన్మానించారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె నిరూపించారని అభినందించారు.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి, మరింత మందికి ఆదర్శంగా నిలువాలని సూచించారు. మహిళలు అవమానాలను ఎదురొంటూ, అడ్డంకులను అధిగమించి విజయాలబాటలో ముందుకెళ్తున్నారని మంత్రి చెప్పారు.