హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా పొన్నం అశోక్‌గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ లీగల్ సెల్ జాతీయ కార్యదర్శి విపుల్ మహేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడైన పొన్నం అశోక్‌గౌడ్ లీగల్ సెల్‌తోపాటు టీపీసీసీ హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. తనను నియమించిన ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.