కూసుమంచి, ఆగస్టు 21: రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం పొంగులేటి విలేకరులతో మాట్లాడారు.
వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయడంతోపాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఎవరైనా తప్పు చేస్తే కేసులు పెడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోజుకు రెండుసార్లు యూరియాపై సమీక్ష చేస్తున్నారని, రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.