హైదరాబాద్ : పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు జిల్లా కాలేజీల ప్రిన్సిపల్స్ గుర్తించారు. హయత్‌నగర్ బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ గుర్తించింది. క్వశ్చన్ పేపర్‌ను వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పంపినట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రాల లీక్‌పై పోలీసులకు బోర్డు సెక్రటరీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.