హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పాలిసెట్ మొదటి దశ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. శనివారం వరకు 5,760 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
911 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు 25తో ముగియనుండగా, వెబ్ ఆప్షన్ల గడువు 27తో ముగుస్తుంది. ఈ నెల 30లోపు సీట్లను కేటాయిస్తారు.