బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:33:18

రెండుకిలోల బంగారం పట్టివేత

రెండుకిలోల బంగారం పట్టివేత

శంషాబాద్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికురాలి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను తనిఖీచేశారు. ఆమె సామగ్రిని సోదాచేయగా.. ఐదు బంగారు బిస్కెట్లు, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు లభించాయి. ఆమె నుంచి మొత్తం 2.021 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో దాని విలువ రూ.96.04 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.


logo