హుజూరాబాద్, నవంబర్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఆదివారం పట్టణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 9న పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టగా, ఎమ్మెల్యే హాజరై మద్దతు ప్రకటించారు.
అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని 35(3) బీఎన్ఎస్ కింద ఎమ్మెల్యేకు ఎస్సై యూనిస్ నోటీసులు అం దజేశారు. ఎమ్మెల్యేతోపాటు బాధితులపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ విషయమై సీఐని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు.