హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు మరోసారి విచారణకు పిలిచారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీస్ ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చి విచారణ పిలవడానికి, మధ్యంతర బెయిల్‌తో సంబంధం లేదని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల నోటీసులకు స్పందించి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతాడా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.