Sircilla | సిరిసిల్లలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా.. ముగ్గురిపై కేసు నమోదు
Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు నకిలీ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ (53), రుద్రంగికి చెందిన బొండు అంజయ్య (55), గంభీరావుపేట మండలం నిర్మాల గ్రామానికి చెందని ఓరుగంటి రాములు (39)పై కేసులు నమోదు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారిని నికలీ వీసాలతో మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఏడాది 19 కేసుల్లో నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. విచారణ జరిపి నేరం రుజువైతే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

