ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 29: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని 3వ బెటాలియన్లో ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం సృష్టించింది. బెటాలియన్లో పనిచేస్తున్న నాగేశ్వర్రావు సెలవు ఇవ్వాలని మంగళవారం అధికారులను కోరగా నిరాకరించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నట్టు సమాచారం.