హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): యూనిఫామ్‌లో ఉన్న పోలీసులను టచ్‌చేస్తే బౌన్సర్లతోపాటు వారి ఏజెన్సీలను వదిలే ప్రసక్తే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్‌కు సం బంధించిన బౌన్సలర్లు సంధ్య థియేటర్ వద్ద అతిగా ప్రవర్తించారని తెలిపారు.
బౌన్సర్లు చట్టానికి వ్యతిరేకంగా ప్రజలపై దా డులు, బెదిరింపులకు పాల్పడి తే.. క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. ఇక నుంచి వీఐపీ, వీవీఐపీలు తమ కార్యక్రమాలు నిర్వహించుకునే బౌన్సర్లు తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.