నల్లగొండ : పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తోటి బ్యాచ్ మేట్కు అండగా నిలిచారు 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు.
నల్లగొండలో నివాసం ఉంటున్న మాజీ కానిస్టేబుల్ అక్తర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విధి నిర్వహణ చేయలేని స్థితిలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. విషయాన్ని తెలుసుకున్న తోటి బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి అక్తర్ కుటుంబానికి అండగా నిలిచారు.
బ్యాచ్ మేట్స్ అంతా కలిసి రూ. 3,15,300 జమ చేసి గురువారం అక్తర్ కుటుంబానికి అందించి బాసటగా నిలిచారు. భవిష్యత్తులోనూ అక్తర్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో బ్యాచ్ మేట్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, మూసి వెంకయ్య, జహంగీర్, జంగయ్య, శ్రీనివాస్, శౌరి, దుర్గారెడ్డి తదితరులున్నారు.