జనవరి 14: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్కు చెందిన సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ నెల 11న బాలంరాయిలోని లీప్యాలెస్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రవికిరణ్ దేవులపల్లి మంగళవారంరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలసాని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు తలసాని మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.