హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పోలీసులు(Police) కనీసం పండుగ పూట కూడా ప్రశాంతంగా గడపని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసులు బలవుతున్నారు.అక్రమ అరెస్టులకు ప్రణాళికలు రచించే వాళ్లు లగ్జరీ ప్యాలెస్‌లో, లక్షల విలువ చేసే బట్టలు చెప్పులు వేసుకుని దర్జాగా కుటుంబంతో పండగ జరుపుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) అరెస్ట్ విషయంలో పోలీసుల దీనస్థితి మరోసారి చర్చనీయాంశమైంది.
వాళ్ల పిల్లా పాపలతో పండుగ రోజు కుటుంబాలతో గడపాల్సిన పోలీసులు ఇలా ఈ ఊరి నుంచి ఆ ఊరికి, రాత్రి పగలు అని తేడ లేకుండా తిరగడం నిజంగా బాధాకరం. కౌశిక్ రెడ్డి అరెస్ట్ కోసం పదుల సంఖ్యలో పోలీసులు, కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు, మళ్లీ హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు..ఆ తర్వాత బందోబస్త్ పేరుతో వందల సంఖ్యలో పోలీసులు రోడ్లపై నిలబెట్టారు. పండగ రోజు కరీంనగర్లో రాజకీయ చర్యలతో ప్రజల్లో చిరాకు పుట్టించే విధంగా ప్రభుత్వ విధానలు ఉండటంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన ప్రణాళిక, ఖచ్చితమైన ఆధారాలు లేకుండా రాజకీయ కక్షలకు పాల్పడితే ఇలాగే ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.
అక్రమ అరెస్టులకు ప్రణాళికలు రచించే వాళ్ళు లగ్జరీ ప్యాలెస్‌లో, లక్షల విలువ చేసే బట్టలు చెప్పులు వేసుకుని దర్జాగా కుటుంబంతో పండగ జరుపుకుంటారు
కానీ వాళ్ళ రాజకీయ కక్ష సాధింపుల కోసం బలయ్యేది పోలీసులు
పిల్లా పాపలతో పండుగ రోజు కుటుంబాలతో గడపాల్సిన వాళ్లు ఇలా ఈ ఊరి నుండి ఆ ఊరికి,… pic.twitter.com/DPyHfEjycT
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025