హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): పన్నుల వ్యవస్థ సరళంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటుచేసిన జాతీ య కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కొటిక్స్ అ కాడమీ(నాసిన్)లను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వెనుకబడిన సత్యసాయి జిల్లా లో నాసిన్ ఏర్పాటు చేశామని, అది ప్రముఖ శిక్షణా సంస్థగా, సుపరిపాలనకు సరికొత్త కేం ద్రంగా మారనుందని తెలిపారు.
నాసిన్ దేశం లో ఆధునిక ఎకోసిస్టంగా మారనుందని, ఇక డ జరిగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఎం తో ప్రయోజనం కలగనుందని తెలిపారు. భూ మి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టు పన్నుల విధానం ఉండాలని చెప్పారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని తెలిపారు. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.