హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ ద్వారా తొక్కిపెట్టించి, మరోవైపు ఉద్యోగాలను భర్తీ చేయడం లేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి మండిపడ్డారు.
గెలిచే అవకాశాలు లేకపోవడం వల్లే నిధులివ్వకుండా, హామీలు లేకుండా మోదీ వెనుదిరిగారని ఎద్దేవాచేశారు.