హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను అనధికారికంగా నరికి వేస్తుండటంతో వాటి రక్షణకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) నడుం బిగించింది. చెట్ల గణన సక్రమంగా ఉండేలా వాటికి మైక్రోచిప్‌లను అమర్చాలని యోచిస్తున్నది. పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరాపార్క్, జూపార్క్, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 100 చెట్లకు మైక్రోచిప్‌లను అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ ప్రాజెక్టు అమలు కోసం బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐడబ్ల్యూఎస్‌టీ)తో చర్చలు జరుపుతున్నట్టు టీఎస్ఎఫ్డీసీ వైస్‌చైర్మన్, ఎండీ జీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.