హైదరాబాద్: తెలంగాణ సామాజిక ముఖచిత్రం-2022, తెలంగాణ రాష్ట్ర గణాంక నివేదిక-2022 పుస్తకాలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విడుదల చేశారు. రెండు పుస్తకాలు ఉద్యోగార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతి అంశాలు, వివిధ రంగాల వివరాలు సమగ్రంగా ఉన్నాయని వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు, గణాంకాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి విద్యార్థులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఖరీదైన ప్రచురణలను ప్రణాళికశాఖ ఉద్యోగార్థులకు రాయితీతో అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లు, లైబ్రరీలు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా www.telangana.gov.in, www.tsdps.telangana.gov.in, www.ecostat.telangana.gov.in వెబ్సైట్లలో సాఫ్ట్ కాపీలు ఉన్నాయని చెప్పారు.