విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. పీఈటీకి జైలు శిక్ష
విద్యార్థిని | విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యాయామ ఉపాధ్యాయుడికి ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్

కోర్టు చౌరస్తా(కరీంనగర్), జూలై 23: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యాయామ ఉపాధ్యాయుడికి ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి మాధవీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. స్థానిక దుర్గమ్మగడ్డకు చెందిన బాలిక కార్ఖానగడ్డలోని ఓ ప్రైవేట్ హైస్కూల్లో మూడోతరగతి చదువుతున్నది. అదే పాఠశాలలో ఘటనకు నాలుగు నెలల ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన నీరటి గోపి (30) వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరాడు.
విద్యార్థినిపై కన్నేసిన గోపి 2017 జూలై 25న సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లేందుకు ఆటో వద్దకు వెళ్తుండగా రమ్మని పిలిచాడు. ఆమెను రెండో అంతస్తుపైకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించగా అతడి నుంచి తప్పించుకున్నది. మరుసటిరోజు అలాగే ప్రవర్తించగా తల్లికి విషయం తెలిపింది. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ విజయ్‌కుమార్ దర్యాప్తు జరిపారు. ప్రాసిక్యూషన్ పక్షాన పీపీ తిరుపతి సాక్షులను ప్రవేశపెట్టగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంగళ్‌దాస్ శ్రీనివాస్ విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు గోపికి జైలుశిక్ష, జరిమానా విధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

