కరీంనగర్ : జిల్లా కేంద్రంలో పీఎంజే జ్యువెల్లరీ షాప్ ( Jewelry Shop ) లో దోపిడీకి పాల్పడ్డ నిందితుల ఫొటోలను ( Suspect Photos ) కరీంనగర్ పోలీసులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం షాప్‌ను తెరిచిన కొద్ది సేపటికే ఐదుగురు దొంగలు చొరబడి పిస్తోలుతో బెదిరించి , కాల్పులకు పాల్పడి పెద్ద ఎత్తున బంగారు నగలను దొంగిలించిన విషయం తెలిసిందే.
కాగా ఘటనపై సీరియస్ దృష్టిని సారించిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా విస్తృతంగా గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పీఎంజే షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలో నమోదైన నిందితుల ఫొటోలను విడుదల చేశారు. నిందితుల సమాచారాన్ని తెలియజేసినవారికి రూ. లక్ష బహుమతిని అందజేస్తామని ప్రకటించారు.
నిందితుల జాడ తెలిసిన వారు ఎస్‌హెచ్‌వో 87126 70762 అనే నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. నిందితుల కాల్పుల్లో గాయపడ్డ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తదితరులు సందర్శించారు. బాధితులను పరామర్శించారు.