జగిత్యాల, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ సంజయ్‌కుమార్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనకు అభినందనలు తెలుపుతూ జగిత్యాల పట్టణంలోని ఆర్డీవో చౌరస్తా, పాతబస్టాండ్ తదితర కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఫ్లెక్సీల్లో ఒరిజినల్ కాంగ్రెస్ పేరిట ముద్రలు వేయడం అందరిని విస్మయానికి గురిచేయడంతోపాటు మాజీమంత్రి, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య కొత్త వివాదానికి దారితీసినట్టయింది.