Farmer Song | బొంరాస్పేట, ఆగస్టు 21 : ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతుగా గుండెమోని రాములు అనే రైతు తన పాట ద్వారా సంఘీభావం ప్రకటించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామానికి చెందిన ఈయన తన పాట ద్వారా రైతుల్లో చైతన్యం నింపుతున్నాడు. ఈయన కూడా ఫార్మా విలేజ్ భూబాధితుడే. ‘ఏమమ్మా సాయమ్మా.. చేతి గుర్తుకు ఓటేస్తివి చేతిల భూమి పోగొడ్తివి’ అంటూ తల్లి సాయమ్మ కాంగ్రెస్కు ఓటేస్తే భూమి పోతున్నదని పాట రూపంలో ఆవేదన వెలిబుచ్చాడు.
మా ర్పు కోసం కాంగ్రెస్కు ఓటేస్తే భూములు పోగొట్టుకునే మా ర్పు వచ్చిందని ప్రభుత్వంపై వ్యంగాస్ర్తాలు సంధించాడు రా ములు. ప్రాణం పోయినా భూమి మాత్రం ఇచ్చేది లేద ని, అభివృద్ధి పేరిట ప్రభుత్వం పేదల భూ ములు తీసుకుంటుందని, భూస్వాముల భూ ములు ఎందుకు తీసుకోవడం లేదని పాట ద్వారా ప్రశ్నిస్తున్నాడు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ చానళ్లలో వైరల్గా మారింది.