హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఎల్ఎల్ఎం కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే పీజీలాసెట్ తుది విడత కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది.
మంగళవారం నుంచి ఈనెల 30వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 31 నుంచి నవంబర్ 2వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. నవంబర్ 5న సీట్లను కేటాయిస్తామన్నారు.